హైదరాబాద్‌ దమ్‌ కా ముర్గ్‌

ABN , First Publish Date - 2021-05-15T16:53:38+05:30 IST

చికెన్‌ లెగ్‌ పీస్‌లు - 800గ్రా(బోన్‌లెస్‌), జీడిపప్పు - 200గ్రా, బాదం - 50గ్రా, ఖుస్‌ఖుస్‌ - 50గ్రా, సారపప్పు(చిరోంజి) - 50గ్రా, ఉల్లిపాయలు - 200గ్రా, నెయ్యి - 100గ్రా, టొమాటో - 400గ్రా,

హైదరాబాద్‌ దమ్‌ కా ముర్గ్‌

కావలసినవి: చికెన్‌ లెగ్‌ పీస్‌లు - 800గ్రా(బోన్‌లెస్‌), జీడిపప్పు - 200గ్రా, బాదం - 50గ్రా, ఖుస్‌ఖుస్‌ - 50గ్రా, సారపప్పు(చిరోంజి) - 50గ్రా, ఉల్లిపాయలు - 200గ్రా, నెయ్యి - 100గ్రా, టొమాటో - 400గ్రా, పెరుగు -200గ్రా, మిరియాలపొడి - 10గ్రా, కారం - 20గ్రా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - 100గ్రా, గరంమసాల - 20గ్రా, పుదీనా - 50గ్రా, ఉప్పు - తగినంత, ఎండు కొబ్బరి - 100గ్రా, పసుపు - 20గ్రా, పచ్చిమిర్చి పేస్టు - 50గ్రా. 


తయారీ విధానం: చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఫ టొమాటోలను ముక్కలుగా కట్‌ చేసి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. జీడిపప్పును పేస్టు చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి పెట్టుకోవాలి. సారపప్పు, ఎండుకొబ్బరి, ఖుస్‌ఖుస్‌, బాదం పలుకులను పాన్‌పై వేసి వేగించి, పేస్టు చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి, నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత టొమాటో పేస్టు, డ్రై ఫ్రూట్‌ పేస్టు వేసి కలపాలి. పెరుగు కూడా వేసి కలియబెట్టుకొని గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరొక పాన్‌ పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత చికెన్‌ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు, కారం వేసి ముక్కలు వేగించాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్న గ్రేవీ వేసి మరికాసేపు ఉడికించాలి. కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 



వెంకటేశ్వర రావు కొడాలి,ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌

Updated Date - 2021-05-15T16:53:38+05:30 IST