క్విక్‌ చికెన్‌!

ABN , First Publish Date - 2021-06-05T14:55:48+05:30 IST

చికెన్‌: కిలో, ఉల్లిపాయ పేస్ట్‌: ఒక కప్పు, టమాటా పేస్ట్‌: ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు, పసుపు, ఉప్పు, నూనె:

క్విక్‌ చికెన్‌!

(తయారీ సమయం: 20 నిమిషాలు)


ఆఫీసు పనితో అలసిపోయి, వండుకునే ఓపిక లేని సమయాల్లో ఈ క్విక్‌ చికెన్‌ ట్రై చేయవచ్చు. 


కావలసిన పదార్థాలు: చికెన్‌: కిలో, ఉల్లిపాయ పేస్ట్‌: ఒక కప్పు, టమాటా పేస్ట్‌: ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు, పసుపు, ఉప్పు, నూనె: తగినంత, కారం: ఒకటిన్నర టీస్పూను, గరం మసాలా: ఒక టీస్పూను, కొత్తిమీర - ఒక కట్ట


తయారీ విధానం: ప్యాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. తర్వాత టమాటా ముద్ద వేసి, నీరు ఇగిరిపోయే వరకూ వేయించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి. ముక్కలు రంగు మారేవరకూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత అర కప్పు నీళ్లు పోసి, కలుపుకుని, మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. చికెన్‌ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి, చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్‌ నుంచి దించుకోవాలి.   

Updated Date - 2021-06-05T14:55:48+05:30 IST