సింపుల్‌ చిల్లీ చికెన్‌!

ABN , First Publish Date - 2021-06-05T15:36:24+05:30 IST

చికెన్‌ బ్రెస్ట్‌: 2, ఉప్పు: ఒక టీస్పూను, గుడ్డు: గిలక్కొట్టుకుని ఉంచుకోవాలి, మైదా పిండి: 3/4 కప్పు, బెంగుళూరు మిర్చి: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి), రెడ్‌ పెప్పర్‌: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి), వెల్లుల్లి: 3 (దంచుకోవాలి), సోయా సాస్‌:

సింపుల్‌ చిల్లీ చికెన్‌!

చలాకీ చికెన్‌!

ఇమ్యూనిటీ పెంచే పోషకాల్లో ప్రధానమైనది ప్రొటీన్‌. చికెన్‌ బ్రెస్ట్‌, కాలేయాల్లో ప్రొటీన్‌ పరిమాణం కొంత ఎక్కువ. కాబట్టి ఈ కొవిడ్‌ కాలంలో చికెన్‌ తరచుగా తింటూ ఉండాలి. త్వరగా, తేలికగా, రుచిగా తయారు చేసుకోగలిగే  చికెన్‌ రెసిపీలు ఇవే! 


(తయారీ సమయం: 20 నిమిషాలు)


తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో వండుకోగలిగే చికెన్‌ రెసిపీ ఇది! స్పైస్‌ ఇష్టపడేవాళ్లకు సూటయ్యే చికెన్‌ రెసిపీ ఇది!


కావలసిన పదార్థాలు: చికెన్‌ బ్రెస్ట్‌: 2, ఉప్పు: ఒక టీస్పూను, గుడ్డు: గిలక్కొట్టుకుని ఉంచుకోవాలి, మైదా పిండి: 3/4 కప్పు, బెంగుళూరు మిర్చి: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి), రెడ్‌ పెప్పర్‌: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి), వెల్లుల్లి: 3 (దంచుకోవాలి), సోయా సాస్‌: 3 టేబుల్‌ స్పూన్లు, టమాటా ముద్ద: 2 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు: అర కప్పు


తయారీ విధానం: చికెన్‌ ముక్కలను సన్నగా, పొడవాటి పట్టీల్లా కట్‌ చేసి పెట్టుకోవాలి. వాటిని మొదట గుడ్డు సొనలో ముంచి, తర్వాత మైదా పిండిలో దొర్లించాలి. ప్యాన్‌లో నూనె వేసి, ఈ ముక్కలను పరిచి, రెండు వైపులా బంగారు రంగుకు మారే వరకూ వేయించుకోవాలి. బెంగుళూరు మిర్చి, రెడ్‌ పెప్పర్‌ ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో వెల్లుల్లి, కారం, సోయా సాస్‌, టమాటా ముద్ద, నీళ్లు వేసి కలిపి, చిన్న మంట మీద చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేసి, సాస్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ నుంచి దించుకుని వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.




Updated Date - 2021-06-05T15:36:24+05:30 IST