చిన్న చేపల వేపుడు
ABN , First Publish Date - 2021-08-07T17:35:21+05:30 IST
చేపలు చిన్నవి - పదిహేను, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి - ఒక టీస్పూన్, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూన్లు, మొక్కజొన్న పిండి - ఒక టేబుల్‌స్పూన్, బియ్యప్పిండి
కావలసినవి: చేపలు చిన్నవి - పదిహేను, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి - ఒక టీస్పూన్, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూన్లు, మొక్కజొన్న పిండి - ఒక టేబుల్‌స్పూన్, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పదినిమిషాలు మారినేట్ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్ చేసిన చేపలు వేసి వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి. మరొకపాన్‌లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగించి తీసుకోవాలి. వీటితో గార్నిష్ చేసుకుని చేపల వేపుడును సర్వ్ చేసుకోవాలి.