బొంబాయి చట్నీ
ABN , First Publish Date - 2021-02-06T16:39:57+05:30 IST
సెనగపిండి, నూనె, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ, ఉల్లిపాయలు, అల్లం ముక్క, టొమాటో, చింతపండు, నిమ్మఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర.
కావలసినవి: సెనగపిండి, నూనె, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ, ఉల్లిపాయలు, అల్లం ముక్క, టొమాటో, చింతపండు, నిమ్మఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర.
తయారీ విధానం: ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక వెడల్పాటి పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించుకోవాలి. అల్లంముక్క వేయాలి. టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. పసుపు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగిన తరువాత సెనగపిండి మిశ్రమం పోయాలి. మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి.ఈ చట్నీ దోశ, పూరీ, చపాతీ, ఇడ్లీలోకి రుచిగా ఉంటుంది.