తీపి కాకర పచ్చడి

ABN , First Publish Date - 2021-02-12T19:48:53+05:30 IST

కాకరకాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. చక్రాల్లా లేదా పొడుగ్గా అయినా పర్వాలేదు. బాండీలో నూనె వేసి కాగిన తరవాత ఈ కాకర ముక్కల్ని వేసి

తీపి కాకర పచ్చడి

కావలసిన పదార్థాలు

కాకరకాయలు: పావు కిలో, ఉల్లిపాయలు: 3, బెల్లం: తగినంత, ఉప్పు, పసుపు, కారం: తగినంత, నూనె: కాసింత.


తయారు చేసే విధానం

కాకరకాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. చక్రాల్లా లేదా పొడుగ్గా అయినా పర్వాలేదు. బాండీలో నూనె వేసి కాగిన తరవాత ఈ కాకర ముక్కల్ని వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఉల్లి ముక్కల్ని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఓ బాండీలో కాస్త నూనెను వేడిచేసి ఉల్లిపాయల ముద్దను వేసి ఉడికించాలి. దీనికి బెల్లం, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. బాగా వేగిన తరవాత వేయించిన కాకర ముక్కల్ని కలిపి రెండు నిమిషాల పాటు మగ్గించాలి. ఈ పచ్చడి కాస్త కారంగా, కాస్త తీపిగా భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-02-12T19:48:53+05:30 IST