సోబా నూడుల్స్‌

ABN , First Publish Date - 2021-09-18T18:51:37+05:30 IST

సోబా నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌(బక్వీట్‌తో తయారుచేసిన నూడుల్స్‌), సోయాసాస్‌ - పావు కప్పు, నువ్వుల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, మిసో - ఒక టేబుల్‌స్పూన్‌(సోయాబీన్‌

సోబా నూడుల్స్‌

కావలసినవి: సోబా నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌(బక్వీట్‌తో తయారుచేసిన నూడుల్స్‌), సోయాసాస్‌ - పావు కప్పు, నువ్వుల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, మిసో - ఒక టేబుల్‌స్పూన్‌(సోయాబీన్‌, బార్లీతో చేసిన చిక్కటి మిశ్రమం), వెల్లుల్లి - రెండు రెబ్బలు, ఉల్లిపాయ - ఒకటి, వేగించిన నువ్వులు - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా నూడుల్స్‌ని ఉడికించుకోవాలి. తరువాత నీళ్లను తీసేసి చల్లటి నీటితో మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో సోయా సాస్‌ తీసుకుని అందులో నువ్వుల నూనె, వెనిగర్‌, తెనే, మిసో, దంచిన వెల్లుల్లి రెబ్బలు  వేసి సాస్‌ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలను గుండ్రంగా తరిగి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో నూడుల్స్‌ తీసుకుని సాస్‌లో ముంచుకుంటూ ప్లేట్‌లోకి మార్చుకోవాలి. నువ్వులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-09-18T18:51:37+05:30 IST