ఆపం

ABN , First Publish Date - 2021-03-04T18:15:24+05:30 IST

బియ్యం- రెండు కప్పులు, దంపుడు బియ్యం- కప్పు, అటుకులు-పిడికెడు, కొబ్బరి తురుము లేదా పాలు- ఒకటిన్నర కప్పు, ఈస్ట్‌- సగం స్పూను, చక్కెర- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- సరిపడా.

ఆపం

కావలసిన పదార్థాలు: బియ్యం- రెండు కప్పులు, దంపుడు బియ్యం- కప్పు, అటుకులు-పిడికెడు, కొబ్బరి తురుము లేదా పాలు- ఒకటిన్నర కప్పు, ఈస్ట్‌- సగం స్పూను, చక్కెర- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- సరిపడా.


తయారుచేసే విధానం: రెండు రకాల బియ్యాలనీ కలిపి కడిగి నీళ్లలో అయిదు గంటలు నానబెట్టిన తరవాత రుబ్బు కోవాలి. ఓ మోస్తరుగా మెదిగాక అటుకులు, కొబ్బరి పాలు లేదా తురుము, ఈస్ట్‌ కూడా కలిపి రుబ్బాలి. ఉప్పు, చక్కెర కలిపి పిండిని వెడల్పాటి గిన్నెలో మూత పెట్టి నానబెట్టాలి. చిక్క బడిన పిండికి ఉదయాన కాస్త నీటిని చేర్చి కావలసిన మేర జారుగా చేసుకోవాలి. కడాయి లేదా ఆపం ప్యాన్‌లో కాస్త నూనె వేసి, గరిటతో పిండిని వేసి మూతపెట్టి దోశలాగ కాల్చితే మెత్తమెత్తని ఆపం రెడీ.

Updated Date - 2021-03-04T18:15:24+05:30 IST