బేక్డ్‌ అరటికాయ సమోస

ABN , First Publish Date - 2021-07-24T18:09:13+05:30 IST

వారం రోజులుగా వానతో తడిసి ముద్దయిపోతున్నాం. ఈ సమయంలో వేడివేడి స్నాక్స్‌ని బాల్కనీలో కూర్చుని తింటే ఆ మజాయే వేరు. ఈస్ట్‌వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌, రాజ్మా పకోడి, అరటికాయ సమోస, ఆల్మండ్‌ కోఫ్తా, రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌... వంటి స్నాక్స్‌ను ట్రై చేస్తే మీ జిహ్వ చాపల్యం కూడా తీరుతుంది. మరి ఆ రుచులను మీరూ ఆస్వాదించండి.

బేక్డ్‌ అరటికాయ సమోస

ముసురు వేళ వేడి వేడిగా..!

వారం రోజులుగా వానతో తడిసి ముద్దయిపోతున్నాం. ఈ సమయంలో వేడివేడి స్నాక్స్‌ని బాల్కనీలో కూర్చుని తింటే ఆ మజాయే వేరు. ఈస్ట్‌వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌, రాజ్మా పకోడి, అరటికాయ సమోస, ఆల్మండ్‌ కోఫ్తా, రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌... వంటి స్నాక్స్‌ను ట్రై చేస్తే మీ జిహ్వ చాపల్యం కూడా తీరుతుంది. మరి ఆ రుచులను మీరూ ఆస్వాదించండి. 

కావలసినవి: ఉల్లిపాయలు - రెండు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, కరివేపాకు పొడి - 5గ్రా, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - నాలుగు, అరటికాయ పేస్టు - 200గ్రా, నూనె - సరిపడా, ఫైలో షీట్స్‌ - నాలుగు, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత. 

తయారీ విధానం: స్టవ్‌ పై పాన్‌పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. తరువాత అరటికాయ పేస్టు, కరివేపాకు పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఫైలో షీట్‌ తీసుకుని మూడు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక ముక్కలో రెండు టేబుల్‌స్పూన్ల అరటికాయ మిశ్రమం పెట్టి త్రిభుజాకారంలో మలవాలి. తరువాత నాన్‌స్టిక్‌ బేకింగ్‌ ట్రేలో పెట్టి ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-07-24T18:09:13+05:30 IST