భాంగ్ పకోడి
ABN , First Publish Date - 2021-03-27T18:10:36+05:30 IST
సెనగపిండి - రెండు కప్పులు, పసుపు - చిటికెడు, కారం - ఒక టేబుల్‌స్పూన్, మామిడికాయ పొడి - అర టీస్పూన్, భాంగ్ పౌడర్ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి.
కావలసినవి: సెనగపిండి - రెండు కప్పులు, పసుపు - చిటికెడు, కారం - ఒక టేబుల్‌స్పూన్, మామిడికాయ పొడి - అర టీస్పూన్, భాంగ్ పౌడర్ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి.
తయారీ విధానం: ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో కారం, మామిడికాయ పొడి, భాంగ్ పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. తరిగిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేయాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని చేత్తో తీసుకుని కొద్దికొద్దిగా వేసి వేగించాలి. పకోడి గోధుమరంగులోకి మారే వరకు వేగించుకోవాలి. ఈ భాంగ్ పకోడి పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.