బ్రొకోలి పనీర్ పీనట్ శాండ్‌విచ్
ABN , First Publish Date - 2021-05-29T16:30:53+05:30 IST
వీట్ బ్రౌన్ బ్రెడ్ - నాలుగు, బ్రొకోలి - ఒకటి, పనీర్ - 150గ్రా, వేగించిన వేరుశనగలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, రెడ్ ఛిల్లీ సాస్ - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల
కావలిసనవి: వీట్ బ్రౌన్ బ్రెడ్ - నాలుగు, బ్రొకోలి - ఒకటి, పనీర్ - 150గ్రా, వేగించిన వేరుశనగలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, రెడ్ ఛిల్లీ సాస్ - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా.
తయారీ విధానం: బ్రొకోలిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనీర్‌ను కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో బ్రొకోలి ముక్కలు తీసుకుని ఒక కప్పు వేడి నీళ్లు పోయాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. కాసేపు వేగిన తరువాత వేడినీళ్లలో నుంచి బ్రొక్కోలి ముక్కలు తీసి పాన్‌లో వేయాలి. కాసేపు వేగించాలి. ఎక్కువ సేపువేగిస్తే బ్రొకోలిలో ఉన్న పోషకాలు నశిస్తాయి. తరువాత పనీర్ ముక్కలు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్‌పై నుంచి దింపుకొన్న తరువాత వేగించిన వేరుశనగలు వేసి కలపాలి. శాండ్‌విచ్ మేకర్‌ను ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ ముక్కపై బ్రొకోలి మిశ్రమం పెట్టి, మరో బ్రెడ్ ముక్కను పైన పెట్టి శాండ్‌విచ్ మేకర్‌లో గోధుమరంగులోకి మారే వరకు టోస్ట్ చేయాలి. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని ఏదైనా స్మూతీతో లేదా జ్యూస్‌తో కలిపి సర్వ్ చేసుకోవాలి.