చెస్ట్‌నట్స్ చీలా
ABN , First Publish Date - 2021-07-10T18:23:42+05:30 IST
చెస్ట్‌నట్స్ పిండి - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - అర టేబుల్‌స్పూన్, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, నువ్వులు - ఒక టేబుల్‌స్పూన్, పసుపు - అర టీస్పూన్, మిరియాలపొడి - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
కావలసినవి: చెస్ట్‌నట్స్ పిండి - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - అర టేబుల్‌స్పూన్, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, నువ్వులు - ఒక టేబుల్‌స్పూన్, పసుపు - అర టీస్పూన్, మిరియాలపొడి - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి తీసుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్రపొడి, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక స్పూన్‌తో మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి. వెడల్పుగా కాకుండా మందంగా పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. పైన నువ్వులు చల్లి ఇంకొంచెం సేపు కాల్చి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.