చోలే రాజ్మా కర్రీ
ABN , First Publish Date - 2021-10-21T18:07:50+05:30 IST
కాబూలీ చనా- కప్పు, రాజ్మా- అర కప్పు, టొమాటో ముక్కలు- రెండు కప్పులు, అల్లం ముక్క- చిన్నది, మిర్చి- రెండు,
కావలసిన పదార్థాలు: కాబూలీ చనా- కప్పు, రాజ్మా- అర కప్పు, టొమాటో ముక్కలు- రెండు కప్పులు, అల్లం ముక్క- చిన్నది, మిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, జీలకర్ర- స్పూను, ధనియాల పొడి- రెండు స్పూన్లు, పసుపు, కారం - అర స్పూను, మిరియాల పొడి, గరం మసాలా - అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: రాత్రంతా నానబెట్టిన కాబూలీ చనా, రాజ్మా గింజల్ని ఉదయం ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. టొమాటోలు, అల్లం కలిపి ప్యూరీగా చేసుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి. దీనికి పొడులన్నీ జతచేయాలి. అయిదు నిమిషాల తరవాత ఉడికించిన రాజ్మా, కాబూలీ చనాను వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాల పాటు మగ్గిస్తే చోలే రాజ్మా కర్రీ సిద్ధం.