పెరుగు ఇడ్లీ

ABN , First Publish Date - 2021-10-29T18:06:17+05:30 IST

ఇడ్లీలు- ఎనిమిది, పెరుగు- అర లీటరు, ఆవాలు-స్పూను, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, దానిమ్మ గింజలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, చక్కెర- స్పూను

పెరుగు ఇడ్లీ

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు- ఎనిమిది, పెరుగు- అర లీటరు, ఆవాలు-స్పూను, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, దానిమ్మ గింజలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, చక్కెర-  స్పూను.


తయారుచేసే విధానం: ఓ వెడల్పాటి గిన్నెలోకి ఇడ్లీలు తీసుకోవాలి. పైన కాస్త నీళ్లను చిలకరించి పెరుగు, ఉప్పు వేసి పోపు పెట్టాలి. పైన దానిమ్మ గింజెలు, కొత్తిమీర తరుగును చల్లితే పెరుగు ఇడ్లీ సిద్ధం.

Updated Date - 2021-10-29T18:06:17+05:30 IST