దోశ

ABN , First Publish Date - 2021-08-14T17:49:58+05:30 IST

బాదం పలుకులు - అరకప్పు, పర్‌మేసన్‌ చీజ్‌ - పావుకప్పు, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు,

దోశ

కావలసినవి: బాదం పలుకులు - అరకప్పు, పర్‌మేసన్‌ చీజ్‌ - పావుకప్పు, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, జీలకర్ర పొడి - పావు టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ముందుగా బాదంపలుకులను పావుగంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత పొట్టుతీసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఉల్లిపాయను తరగాలి. పచ్చిమిర్చి కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలోకి బాదంపలుకుల పొడి తీసుకుని అందులో పర్‌మేసన్‌ చీజ్‌, తగినంత ఉప్పు, ఇంగువ, జీలకర్రపొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ కలపాలి. స్టవ్‌పై పెనంపెట్టి కొద్దిగా నూనె రాసి వేడి అయ్యాక దోశ పోసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే ఈ దోశలు రుచిగా ఉంటాయి.

Updated Date - 2021-08-14T17:49:58+05:30 IST