ఈస్ట్ వెస్ట్ స్ర్పింగ్ రోల్స్
ABN , First Publish Date - 2021-07-24T18:06:22+05:30 IST
స్ర్పింగ్‌రోల్ షీట్స్ - తగినన్ని, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ - రెండు, క్యాప్సికం - ఒకటి, టొమాటో - ఒకటి, బ్రెడ్ క్రంబ్స్
కావలసినవి: స్ర్పింగ్‌రోల్ షీట్స్ - తగినన్ని, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ - రెండు, క్యాప్సికం - ఒకటి, టొమాటో - ఒకటి, బ్రెడ్ క్రంబ్స్ - రెండు టేబుల్‌స్పూన్లు, పర్‌మేసన్ ఛీజ్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, అల్లం ముక్క - కొద్దిగా, బఫెల్లో మొజరెల్లా ఛీజ్ - 60గ్రా, ఉల్లికాడలు - రెండు, వెనిగర్ - ఒక టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్‌స్పూన్లు, స్టాక్ - ఒక టీస్పూన్.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, క్యాప్సికం, అల్లం వేగించాలి. బాగా వేగిన తరువాత వెనిగర్ వేసి ఒక పాత్రలోకి మార్చుకోవాలి. టొమాటోను కట్ చేసి ముక్కలు ఎండబెట్టుకోవాలి. తరువాత ఆ ముక్కలు, బ్రెడ్ క్రంబ్స్, పర్‌మేసన్ ఛీజ్, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లికాడలు వేసి కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికంలో కలుపుకోవాలి. ఒక చిన్న పాత్రలో కార్న్‌ఫ్లోర్, స్టాక్ తీసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఇప్పుడు స్ర్పింగ్ రోల్ షీట్ తీసుకుని బ్రష్‌తో కార్న్‌ఫ్లోర్ పేస్టు పూయాలి. కొన్ని తులసి ఆకులు, ఉల్లిపాయ, క్యాప్సికం మిశ్రమం, మొజరెల్లా ఛీజ్ వేసి రోల్ చుట్టుకోవాలి. నూనెలో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.