కబాబ్స్
ABN , First Publish Date - 2021-05-22T19:14:29+05:30 IST
మినుములు - రెండు కప్పులు, కారం - ఒక టీస్పూన్, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్, గరంమసాల - పావు టీస్పూన్, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి
కావలసినవి: మినుములు - రెండు కప్పులు, కారం - ఒక టీస్పూన్, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్, గరంమసాల - పావు టీస్పూన్, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కొత్తిమీర - కొద్దిగా, కొబ్బరితురుము - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా మినుములు రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినుములలో నుంచి నీళ్లను తీసివేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్రపొడి, కొబ్బరితురుము, కొత్తిమీర తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లుగా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సాస్ లేదా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.