Mexican ఫ్రైడ్ రైస్
ABN , First Publish Date - 2021-07-22T18:46:28+05:30 IST
బాస్మతి అన్నం- రెండు కప్పులు, రాజ్మా- కప్పు (నానబెట్టి ఉడికించినవి), స్వీట్ కార్న్- కప్పు (ఉడికించినవి), ఉల్లిగడ్డ, టమోటా,
కావలసిన పదార్థాలు: బాస్మతి అన్నం- రెండు కప్పులు, రాజ్మా- కప్పు (నానబెట్టి ఉడికించినవి), స్వీట్ కార్న్- కప్పు (ఉడికించినవి), ఉల్లిగడ్డ, టమోటా, క్యాప్సికమ్- ఒక్కోటీ అర కప్పు, వెనిగర్- అర స్పూను, మిరియాలు- అర స్పూను, ఉప్పు, నూనె- తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద- కొంచెం, వెన్నె- రెండు స్పూన్లు, టమోటా కెచప్- స్పూను.
తయారుచేసే విధానం: ఓ పాన్‌లో వెన్నెవేసి కాగాక అల్లంవెల్లుల్ని పేస్టును వేయాలి. మిరియాలు, టమోటా ముక్కలు జతచేసి ఓ మూడు నిమిషాలు వేయించాలి. రాజ్మా, స్వీట్ కార్న్ వేసి మగ్గించాలి. ఉప్పు, కారం పొడి, కెచప్, వెనిగర్ వేసి బాగా కలిపాలి. ఆఖర్న అన్నం కూడా వేసి కలిపి రెండు నిమిషాలు వేయిస్తే వెజిటబుల్ మెక్సికన్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.