మిక్స్‌డ్‌ మిల్లెట్‌ భేల్‌ పూరి

ABN , First Publish Date - 2021-05-29T16:56:38+05:30 IST

మిక్స్‌ మిల్లెట్‌ ఫ్లేక్స్‌ - ఒక కప్పు, రాగి ఫ్లేక్స్‌ - ఒక కప్పు, మురమురాలు (ఫఫ్డ్‌ రైస్‌ ఫ్లేక్స్‌) - మూడు కప్పులు, వేరుశనగలు - అరకప్పు(వేగించినవి), అమర్‌నాథ్‌, కారప్పూస - అరకప్పు, ఛాట్‌ మసాల

మిక్స్‌డ్‌ మిల్లెట్‌ భేల్‌ పూరి

కావలసినవి: మిక్స్‌ మిల్లెట్‌ ఫ్లేక్స్‌ - ఒక కప్పు, రాగి ఫ్లేక్స్‌ - ఒక కప్పు, మురమురాలు (ఫఫ్డ్‌ రైస్‌ ఫ్లేక్స్‌) - మూడు కప్పులు, వేరుశనగలు - అరకప్పు(వేగించినవి), అమర్‌నాథ్‌, కారప్పూస - అరకప్పు, ఛాట్‌ మసాల - రెండు టేబుల్‌స్పూన్లు, నల్ల నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు, బంగాళదుంపలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, నిమ్మరసం - నాలుగు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, గ్రీన్‌ చట్నీ - మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, మునగాకు పొడి - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకుని అందులో మిక్స్‌ మిల్లెట్స్‌, రాగి ఫ్లేక్స్‌, మురమురాలు, వేగించిన వేరుశనగలు, అమర్‌నాథ్‌, కారప్పూస వేసి కలుపుకోవాలి. తరువాత ఛాట్‌ మసాల చల్లుకుని, నల్ల నువ్వులు వేసుకోవాలి. తరువాత బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మునగాకు పొడి, గ్రీన్‌చట్నీ వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.


Updated Date - 2021-05-29T16:56:38+05:30 IST