మటర్ పులావ్
ABN , First Publish Date - 2021-03-12T18:01:04+05:30 IST
బాస్మతి రైస్: ఓ కప్పు, పచ్చి బఠానీలు: ముప్పావు కప్పు, ఉల్లిముక్కలు: సగం కప్పు, నెయ్యి లేదా బటర్: మూడు స్పూన్లు, జీలకర్ర: స్పూను, దాల్చిన చెక్క: ఓ ముక్క, లవంగాలు: మూడు, బిర్యానీ ఆకులు: రెండు , నూనె, నీళ్లు, ఉప్పు: తగినంత
కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్: ఓ కప్పు, పచ్చి బఠానీలు: ముప్పావు కప్పు, ఉల్లిముక్కలు: సగం కప్పు, నెయ్యి లేదా బటర్: మూడు స్పూన్లు, జీలకర్ర: స్పూను, దాల్చిన చెక్క: ఓ ముక్క, లవంగాలు: మూడు, బిర్యానీ ఆకులు: రెండు , నూనె, నీళ్లు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి కాగాక జీలకర్రతో పాటు మసాలా దినుసులన్నీ వేసి కాస్త వేయించాలి. ఆ తరవాత ఉల్లిముక్కలు వేసి ఎర్రగా మగ్గేవరకు వేపాలి. పచ్చి బఠాణీలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. దీనికి నీళ్లు ఒంపేసిన బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి. ఉప్పు కూడా వేయాలి. అవసరమైన మేరకు నీళ్లను పోసి కుక్కర్ మూతను పెట్టాలి. రెండు విజిల్స్ రాగానే దింపేస్తే వేడి వేడి మటర్ పులావ్ రెడీ.