ఓట్స్ ఇడ్లీ
ABN , First Publish Date - 2021-03-19T18:21:47+05:30 IST
ఓట్స్: ఓ కప్పు, రవ్వ: సగం కప్పు, పుల్లపెరుగు: సగం కప్పు, క్యారట్ తురుము: సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు: సగం కప్పు, ఉప్పు, నీరు, నూనె, తిరగమోత గింజలు: తగినంత, మిర్చి: రెండు, మిరియాల పొడి: సగం స్పూను, జీడిపప్పు: పది, అల్లం: చిన్న ముక్క (ముక్కలుగా కట్ చేసుకోవాలి).
కావలసిన పదార్థాలు: ఓట్స్: ఓ కప్పు, రవ్వ: సగం కప్పు, పుల్లపెరుగు: సగం కప్పు, క్యారట్ తురుము: సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు: సగం కప్పు, ఉప్పు, నీరు, నూనె, తిరగమోత గింజలు: తగినంత, మిర్చి: రెండు, మిరియాల పొడి: సగం స్పూను, జీడిపప్పు: పది, అల్లం: చిన్న ముక్క (ముక్కలుగా కట్ చేసుకోవాలి).
తయారు చేసే విధానం: ముందుగా ఓట్స్‌ను మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఓ బాణలిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగాక ఓట్స్ పిండిని కూడా కలిపి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. ఇది చల్లబడ్డాక క్యారట్ తురుము, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, మిర్చి తరిగి వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి, పెరుగు చేర్చి పోపు పెట్టాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలి. నీటిని కూడా కలిపి జారుగా కలియబెట్టి ఓ అయిదు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి.