రాగి కుకీస్
ABN , First Publish Date - 2021-05-29T16:44:32+05:30 IST
వెన్న - పావుకప్పు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, రాగి పిండి - ముప్పావు కప్పు,
కావలసినవి: వెన్న - పావుకప్పు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్, రాగి పిండి - ముప్పావు కప్పు, గోధుమపిండి - పావు కప్పు, కోకో పౌడర్ - ఒక టేబుల్‌స్పూన్, బేకింగ్‌పౌడర్ - అర టీస్పూన్, పంచదార - పావుకప్పు.
తయారీ విధానం: ఒక పాత్రలో రాగిపిండి, గోధుమపిండి, కోకోపౌడర్, బేకింగ్‌పౌడర్, పంచదార వేసి కలుపుకోవాలి. తరువాత కరిగించిన వెన్న, వెనీలా ఎసెన్స్ వేసి కలియబెట్టాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్పూన్‌తో పాలు కొద్దికొద్దిగా పోస్తూ మెత్తటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకుని, అరచేతిలో వత్తుకుంటూ కుకీలు తయారుచేసుకోవాలి. కుకీ ట్రేలో బటర్ పేపర్ వేసి కుకీలను పెట్టాలి. కడాయిలో రెండు కప్పుల ఉప్పు వేసి, స్టీల్ స్టాండ్ పెట్టి సుమారు పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చివరగా కుకీస్ ఉన్న ట్రేను కడాయిలో పెట్టి మూత పెట్టి పావుగంటపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి.