రైస్ బాల్స్
ABN , First Publish Date - 2021-02-27T17:18:42+05:30 IST
అన్నం - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, పాలకూర - ఒక కట్ట, బియ్యప్పిండి - అరకప్పు, అల్లం పేస్టు - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్, పంచదార - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
కావలసినవి: అన్నం - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, పాలకూర - ఒక కట్ట, బియ్యప్పిండి - అరకప్పు, అల్లం పేస్టు - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్, పంచదార - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ఒక పాత్రలో అన్నం తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ, పాలకూర, కొబ్బరి తురుము, బియ్యప్పిండి, అల్లంపేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పంచదార, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కెచ్‌పతో తింటే ఈ రైస్ బాల్స్ రుచిగా ఉంటాయి.