సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌

ABN , First Publish Date - 2021-11-20T17:52:39+05:30 IST

పనీర్‌ - 100 గ్రా, నెయ్యి-20 మి.లీ, గుంటూరు కారం పొడి-20 గ్రా, ధనియాలు- 30 గ్రా, నల్ల మిరియాలు- 2గ్రా, జీరా - 1 గ్రా, కరివేపాకు- 5 గ్రా, నిమ్మ-1, పచ్చిమిర్చి-5, సగ్గుబియ్యం

సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌

కావాల్సిన పదార్థాలు: పనీర్‌ - 100 గ్రా, నెయ్యి-20 మి.లీ, గుంటూరు కారం పొడి-20 గ్రా, ధనియాలు- 30 గ్రా, నల్ల మిరియాలు- 2గ్రా, జీరా - 1 గ్రా, కరివేపాకు- 5 గ్రా, నిమ్మ-1, పచ్చిమిర్చి-5, సగ్గుబియ్యం- 40 గ్రా, పెసరపప్పు- 40 గ్రా, పసుపు-2గ్రా, అల్లం- 5 గ్రా, ఉప్పు- 10 గ్రా, నల్లమిరియాల పొడి- 3గ్రా, కొత్తిమీర- 5 గ్రా, సగ్గుబియ్యం- 3గ్రా, ఆయిల్‌ - 12 మి.లీ.


తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యంను వేడి నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత ఓ గిన్నెలో ధనియాలు, జీలకర్ర, బ్లాక్‌ పెప్పర్‌ కార్న్‌ను ముందుగా డ్రై రోస్ట్‌ చేయాలి.  ఇప్పుడు నానబెట్టిన పచ్చిమిర్చి, రోస్టెడ్‌ స్పైసెస్‌ను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.  ఇప్పుడు నెయ్యిలో ఈ పేస్ట్‌ను ఫ్రై చేయాలి. పనీర్‌ క్యూబ్స్‌, ఉప్పు వేసి నెయ్యిలో ఫ్రై చేయాలి.


సాగో పొంగల్‌

రెండు గంటల పాటు సగ్గు బియ్యం నాన  బెట్టాలి.  ఈ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి.  ఓ గిన్నెలో ఆయిల్‌ వేసి ఆవాలు, జీలకర్ర, నల్లమిరియాలు వేసి వేగించడంతో పాటుగా అల్లం, పచ్చిమిర్చి, పసుపు  వేసి కలియతిప్పి, దీనిలో పెసరపప్పు, సగ్గు బియ్యం, తగినంత నీరు కలపాలి. సన్నటి మంటపై ఉడకనిచ్చి నెయ్యి, కొత్తిమీర ఆకులు వేయాలి. ఈ సాగో పొంగల్‌ పై పనీర్‌ ఘీ రోస్ట్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.


సూర్య

హెడ్‌ చెఫ్‌, ఫర్జీ కేఫ్‌, హైదరాబాద్‌

Updated Date - 2021-11-20T17:52:39+05:30 IST