వెజ్ బర్గర్
ABN , First Publish Date - 2021-07-22T18:03:06+05:30 IST
బర్గర్ బన్- నాలుగు, ఆలుగడ్డలు- మూడు, క్యారెట్- ఒకటి, బీన్స్- అర కప్పు, బఠానీ- అర కప్పు, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, శనగ పిండి- మూడు స్పూన్లు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- అర స్పూను, పచ్చిమిర్చి- అర స్పూను, కొత్తిమీర తురుము- స్పూను,
కావలసిన పదార్థాలు: బర్గర్ బన్- నాలుగు, ఆలుగడ్డలు- మూడు, క్యారెట్- ఒకటి, బీన్స్- అర కప్పు, బఠానీ- అర కప్పు, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, శనగ పిండి- మూడు స్పూన్లు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద- అర స్పూను, పచ్చిమిర్చి- అర స్పూను, కొత్తిమీర తురుము- స్పూను, గరం మసాలా, కారం, పసుపు - అర స్పూను చొప్పున, ఉప్పు, నూనె, నీరు, - తగినంత, టాపింగ్స్ కోసం- టమోటా, కీరా, ఉల్లిగడ్డ, క్యాబేజీ, మయోనీస్ డ్రెస్సింగ్ కోసం- వేగాన్ మయోనీస్ 3 స్పూన్లు, ఆవాలు, చక్కెర, ఉప్పు, నిమ్మరసం- ఒక్కోటీ అర స్పూను.
తయారుచేసే విధానం: ఉల్లిముక్కలు కాకుండా మిగతా కూరగాయలన్నిటినీ ఉడికించి ముద్దగా చేసిపెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కారంపొడి వేపాలి. ఇందులోనే ఉల్లిముక్కల్ని వేసి దోరగా కాలాక. పసుపుతో పాటు మిగతా పొడులన్నీ వేసి వేగాక కూరగాయల ముద్దనీ కలిపి వేయించి పక్కన పెట్టాలి. ఓ గిన్నెలో మొక్కజొన్న, శనగ, బియ్యం పిండిని వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. వెజ్ మిశ్రమాన్ని ముద్దలుగా చేయాలి. ఒక్కో ముద్దనీ పిండిలో అద్దుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటినే వెజ్ పాటీలంటారు. ఓ చిన్న కప్పులో మయోనీస్. ఆవాలు, నిమ్మరసం, ఉప్పు, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. మరో పక్కన టమోటా, ఉల్లి, క్యాబేజీ, కీరాలను సన్న ముక్కలుగా కోసుకోవాలి. బర్గర్ బన్‌ను రెండుగా కట్ చేసి రెండువైపులా వెన్న పూసి పాన్‌లో అటూ ఇటూ తిప్పి దోరగా కాల్చాలి. బన్ మధ్యలో మయోనీస్ మిశ్రమం, వెజ్ పాటీలు, కూరగాయల ముక్కలు దాని పైన మళ్లీ మయోనీస్ మిశ్రమం వేస్తే వెజ్ బర్గర్ రెడీ.