వెజ్‌ కోఫ్తా బిర్యానీ

ABN , First Publish Date - 2021-11-17T19:12:27+05:30 IST

కోఫ్తా కోసం: పనీరు తురుము - కప్పు, ఆలుగడ్డలు- రెండు(ఉడికించినవి), అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, పచ్చి మిర్చి- ఒకటి, కారం పొడి - అర స్పూను, గరం మసాలా- అర స్పూను, శెనగ పిండి-

వెజ్‌ కోఫ్తా బిర్యానీ

కావలసిన పదార్థాలు:  కోఫ్తా కోసం: పనీరు తురుము - కప్పు, ఆలుగడ్డలు- రెండు(ఉడికించినవి), అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, పచ్చి మిర్చి-  ఒకటి, కారం పొడి - అర స్పూను, గరం మసాలా- అర స్పూను, శెనగ పిండి- పావు స్పూను, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


కర్రీ కోసం: నెయ్యి- రెండు స్పూన్లు, దాల్చిన చెక్క- ఒకటి, యాలకులు- మూడు, లవంగాలు- ఏడు, జీరా- స్పూను, ఉల్లి- ఒకటి, అల్లం, వెల్లుల్లి పేస్టు- స్పూను, టొమాటో - ఒకటి, పెరుగు- కప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు- తగినంత.


అన్నం కోసం: బాస్మతి బియ్యం- కప్పున్నర, నీళ్లు- ఎనిమిది కప్పులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క - రెండు, జీరా- స్పూను, లవంగాలు- అయిదు, నూనె- తగినంత, కుంకుమ పువ్వు నీళ్లు - స్పూను.


తయారుచేసే విధానం: బాస్మతి బియ్యాన్ని ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి. ఓ గిన్నెలో పనీరు ముక్కలు, ఆలు, వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, శెనగ పిండి, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలుపుకోవాలి. కాస్త నీటిని కలిపి ముద్దగా చేయాలి. ఈ ముద్దను చిన్న బంతులుగా చేసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ మందపాటి పాన్‌లో ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసి వేడిచేయాలి. నీళ్లు వేడి కాగానే బాస్మతి బియ్యం, స్పూను నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఓ మోస్తరు ఉడికిన బియ్యాన్ని జల్లెడ గట్టి, చల్లనీళ్లతో కడగాలి. ఓ పెద్ద పాన్‌లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, యాల కులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర చిటపటలాడించాలి. ఇందులో ఉల్లి, మిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఉల్లి రంగు మారాక, టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గించాలి. కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. పెరుగు కూడా జతచేయాలి. పుదీనా, కొత్తిమీర తరుగు, నీళ్లు వేయాలి. కాస్త దగ్గరకి అయ్యాక కోఫ్తా బాల్స్‌ని వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. ఓ వెడల్పాటి పాన్‌ అడుగున పూర్తిగా కోఫ్తా కర్రీని వేసి కాస్త పక్కకు తీసిపెట్టాలి. దీని మీద ఉడికించిన బాస్మతి అన్నంవేయాలి. దీని పైన మిగిలిన కోఫ్తా కర్రీవేసి ఆపైన మరో పొరగా బాస్మతి అన్నం వేసి పైన పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిముక్కలు, బిర్యానీ మసాలా, కుంకుమ పువ్వు నీళ్లు, ఓ అర గ్లాస్‌ మంచి నీళ్లు వేసి మూత పెట్టాలి. తక్కువ మంట మీద పావుగంట ఉడికిస్తే వెజ్‌ కోఫ్తా బిర్యానీ రెడీ.

Updated Date - 2021-11-17T19:12:27+05:30 IST