విటమిన్ ఇడ్లీ
ABN , First Publish Date - 2021-02-06T16:56:43+05:30 IST
ముందురోజు రాత్రి మినప్పప్పు, రాగులు విడివిడిగా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బీట్‌రూట్ ముక్కలు
కావలసినవి: రాగులు, బీట్‌రూట్, మినప్పప్పు, ఇడ్లీనూక, ఉప్పు, నూనె.
తయారీ విధానం: ముందురోజు రాత్రి మినప్పప్పు, రాగులు విడివిడిగా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బీట్‌రూట్ ముక్కలు వేసి రుబ్బుకుని పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీనూక కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించిన తరువాత చట్నీతో కలిపి సర్వ్ చేసుకోవాలి.