మద్యానికి బానిసైన భర్త.. భార్య చెప్తున్నా వినకుండా.. కూతురును పాఠశాల మాన్పించి మరీ..
ABN , First Publish Date - 2022-11-17T19:57:35+05:30 IST
కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. చిత్రహింసలు పెట్టాడు. అనంతపురం జిల్లా (Anantapur District) ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి చెందిన లాలెప్ప.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఉరవకొండ: కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. చిత్రహింసలు పెట్టాడు. అనంతపురం జిల్లా (Anantapur District) ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి చెందిన లాలెప్ప , కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేసినట్లు ఉరవకొండ పోలీసులు తెలిపారు. లాలెప్ప ఓ కిరాణా షాపులో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై, భార్య, కుమార్తెను వేధిస్తుండేవాడు. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే పాఠశాల కూడా మాన్పించాడు. తండ్రి వేధింపులను బాధిత బాలిక.. రాష్ట్ర, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌కు లేఖ ద్వారా తెలియజేసింది. డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి తదితరులు ఉరవకొండలో విచారణ చేపట్టారు. అందులో బాలికపై వేధింపులు వాస్తవమేనని తేలింది. దీంతో ఐసీడీఎస్ పీడీ.. బాధిత బాలిక, ఆమె తల్లిని సీడబ్ల్యూసీ ముందు హాజరు పరిచారు. బాలికను వేరే పాఠశాలలో చేర్పించి, చదివిస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.