అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి

ABN , First Publish Date - 2022-12-15T03:24:16+05:30 IST

అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి.. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట

ఎమ్మిగనూరు, డిసెంబరు 14: అమెరికా అమ్మాయి.. ఇండియా అబ్బాయి ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి.. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మంత్రాలయం మండలం వి.తిమ్మాపురం గ్రామానికి చెందిన గిరిరెడ్డి వీరారెడ్డి, సావిత్రమ్మల దంపతుల కుమారుడు జి.వీరసేనారెడ్డి ఎమ్మెస్సీ పీహెచ్‌డీ పూర్తిచేసి.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పనిచేసే క్లేర్‌తో ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలను ఒప్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం బుధవారం ఎమ్మిగనూరులో వీరసేనారెడ్డి, లిఖిత (క్లేర్‌)ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Updated Date - 2022-12-15T03:24:18+05:30 IST