TDP Vs YCP: చంద్రబాబు ఆ మాట ఎక్కడన్నారో చూపాలి... మండలిలో లోకేష్ సవాల్
ABN , First Publish Date - 2022-09-16T16:45:10+05:30 IST
రెండో రోజు మొదలైన శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
అమరావతి: రెండో రోజు మొదలైన శాసనమండలి (AP Legislative Council ) సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) వ్యవసాయం దండగ అన్నారంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వ్యాఖ్యలు చేశారు. దీనిపై నారా లోకేష్ (Nara lokesh), టీడీపీ ఎమ్మెల్సీ (TDP MLCs)లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపించాలి అంటూ అధికార పక్షానికి లోకేష్ (TDp Leader) సవాల్ విసిరారు. అధికారపక్షం వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టిన నిరసనకు దిగారు. జగన్ (CM Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధాన్యం బకాయిలు కూడా చెల్లించలేని రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ (YCP) అంటూ లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఆధారాలు అంటే ఎక్కడ నుండి తెస్తామంటూ టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు వైసీపీ మంత్రులు ప్రయత్నించారు. చంద్రబాబు (TDP Chief)ను ఉద్దేశించి మాట్లాడలేదంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వింత వాదనకు దిగారు.