AP TS High Court Judges: శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2022-11-06T04:52:16+05:30 IST
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.
తిరుమల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, వేకువజామున ఆలయ మాడవీధుల్లో జరిగిన ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపులో పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.