జగన్‌ పాలనలో దోపిడీకి గురవుతున్న బీసీలు: కాల్వ

ABN , First Publish Date - 2022-10-27T04:52:51+05:30 IST

‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ర్టా న్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి రాసిచ్చారు.

జగన్‌ పాలనలో దోపిడీకి గురవుతున్న బీసీలు: కాల్వ

అనంతపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ర్టా న్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి రాసిచ్చారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. వారి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగుతోంది’’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ వారి మాటే చలామణి అవుతోందని విమర్శించారు. అనంతపురంలో బుధవారం మాట్లాడారు. జగన్‌రెడ్డి పాలనలో బీసీలు తీవ్ర దోపిడీకి, పీడనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వాల్మీకి బోయల ఎస్టీ జాబితాకు సంబంధించి ఏకసభ్య కమిషన్‌ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పెద్దారెడ్డి తదితర రెడ్ల కనుసన్నల్లో నియమించడమంటే బీసీల గొంతు కోయడమే’’ అన్నారు.

Updated Date - 2022-10-27T04:52:53+05:30 IST