Devineni చందూకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-28T13:06:35+05:30 IST

Devineni చందూకు కీలక బాధ్యతలు అప్పగించింన చంద్రబాబు

Devineni చందూకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

విజయవాడ : తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్‌ (చందు) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు చందుకు రాష్ట్ర పదవి కట్టబెట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 2012లో చంద్రబాబు ’మీ కోసం’ పాదయాత్రలో దేవినేని చందు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తొలుత విజయవాడ అర్బన్‌ తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి తాజాగా తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించింది.


బాధ్యత పెరిగింది

ఈ పదవితో తనపై బాధ్యత మరింత పెరిగిందని దేవినేని చందు పేర్కొన్నారు. పదవులు ఉన్నా.. లేకపోయినా ఎప్పుడూ పార్టీ కోసం అంకితభావంతో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు యువత సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలను కొనసాగిస్తూ పార్టీని జనానికి మరింత చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ దాడులను ఎదుర్కొంటామన్నారు.

Updated Date - 2022-04-28T13:06:35+05:30 IST