పవన్‌కల్యాణ్‌ హత్యకు సీఎం బంధువుల కుట్ర

ABN , First Publish Date - 2022-11-03T23:53:02+05:30 IST

జనసేన ఆధినేత పవన్‌కలాణ్‌ను హత్య చేసేందుకు ముఖ్యమంత్రి బంధువులు కుట్రపన్నారని జనసేన పార్టీ నగర అ ధ్యక్షుడు, కార్పొరేటర్‌ మలగా రమేష్‌ హెచ్చరించారు.

పవన్‌కల్యాణ్‌ హత్యకు సీఎం బంధువుల కుట్ర

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 3: జనసేన ఆధినేత పవన్‌కలాణ్‌ను హత్య చేసేందుకు ముఖ్యమంత్రి బంధువులు కుట్రపన్నారని జనసేన పార్టీ నగర అ ధ్యక్షుడు, కార్పొరేటర్‌ మలగా రమేష్‌ హెచ్చరించారు. ఒంగోలులోని జనసేన పా ర్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ను హత్య చే సేందుకు వైసీపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఆయనకు ఏదైనా హాని తలపెడితే జనసైనికుల ఉగ్ర రూపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార వైసీపీ అకృత్యాలపై రాష్ట్రంలో రోజురోజుకు మితిమీరుతున్నాయన్నారు. పవన్‌ ఓ వ్యక్తి కాదని, ఒక శక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆయన వెంట కొన్ని లక్షల మంది జనసైనికులు ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్టెం ప్రసాద్‌, చెరుకూరి ఫణికుమార్‌, పోకల నరేంద్ర, సుభాని, గుర్రం మాల్యాద్రి, కోట సుధీర్‌, ఆకుపాటి ఉష, గో విందు కోమలి, వాసుకి, ఉష, చెన్ను నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T23:53:06+05:30 IST