మల్లవరం ఇసుకరీచ్‌లో ఎక్స్‌కవేటర్‌, లారీ సీజ్‌

ABN , First Publish Date - 2022-11-03T23:51:40+05:30 IST

మల్లవరం ఇసుక క్వారీలో గురువారం జేబీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బంది చేస్తున్న తవ్వకాలను మండల అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌కవేటర్‌, లారీని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు త రలించారు.

మల్లవరం ఇసుకరీచ్‌లో ఎక్స్‌కవేటర్‌, లారీ సీజ్‌

పరిశీలించిన అధికారులు

మద్దిపాడు, నవంబరు 3: మల్లవరం ఇసుక క్వారీలో గురువారం జేబీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బంది చేస్తున్న తవ్వకాలను మండల అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌కవేటర్‌, లారీని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు త రలించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం జేబీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి 2021 లో మల్లవరంలోని ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఎక్స్‌కవేటర్‌ ద్వారా ఇసుకను తవ్వుతుండగా సమాచారం అందుకున్న తహసీలార్‌ జె.లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ శ్రీరాం, మైనింగ్‌ అధికారులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరని చెప్పారు. జగనన్న కాలనీలు, ప్రభుత్వభవనాలు, సచివాలయాలకు మాత్రమే ఇసుక సర ఫరా చేయాలని కలెక్టర్‌ ఆదేశించినట్టు తహసీల్దార్‌ సదరు కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. అనంతరం జేబీ ఎక్స్‌కవటేర్‌ను, లారీని సీజ్‌చేసి మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలించారు. ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు తీసుకువస్తేనే అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా ఇసుకను త్వవకాలు చేప డితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T23:51:43+05:30 IST