నెల్లూరును వీడని వర్షాలు
ABN , First Publish Date - 2022-11-15T03:36:03+05:30 IST
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం కూడా భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
నాలుగోరోజు కూడా భారీగానే
పొంగుతున్న వాగులు, వంకలు
దెబ్బతిన్న అంతర్గత రహదారులు
నెల్లూరు, నవంబరు14(ఆంధ్రజ్యోతి): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం కూడా భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదివరకే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాల కారణం గా మరింత దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పట్ణణాల పరిధిలోని అంతర్గత రోడ్లు దారుణంగా దెబ్బతిన్నా యి. గత మూడు రోజులలో జిల్లాలో సగటున 139.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 28 మండలాల్లో గరిష్ఠంగా 284 నుంచి కనిష్ఠంగా 102 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. పలుచోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షం నష్టంపై అంచనాకు అధికార యంత్రాంగం సన్నద్ధమయింది.