అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఆంక్షలు..
ABN , First Publish Date - 2022-10-21T19:29:31+05:30 IST
అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు (AP High court) ఆంక్షలు విధించింది.
అమరావతి : అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు (AP High court) ఆంక్షలు విధించింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చే వాళ్లంతా (All supporters) రోడ్డుకు రెండు వైపులా నిలబడి మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్రలో కలిసి నడవకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ఆదేశించింది. పాదయాత్రకు అనుమతి రద్దు చేయమని ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. పాదయాత్రకు ఉత్తరాంధ్ర రైతుల మద్దతు లభించనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలపై వేసిన పిటిషన్‌లను కూడా కలిపి వింటానని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.