Rayalaseema: సీమకు దశబ్దాలుగా అన్యాయం: దశరథరామిరెడ్డి
ABN , First Publish Date - 2022-11-16T19:58:48+05:30 IST
పాలకులు దశాబ్దాలుగా రాయలసీమ (Rayalaseema)కు అన్యాయం చేస్తున్నారని రామలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.
విజయవాడ: పాలకులు దశాబ్దాలుగా రాయలసీమ (Rayalaseema)కు అన్యాయం చేస్తున్నారని రామలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో ‘‘రాయలసీమ సత్యాగ్రహాదీక్ష ’’ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడాతూ మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టకపోవడం అన్యాయమన్నారు. విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కులను అమలు పరిచేందుకు ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. సీఆర్డీఏ (CRDA) చట్టంలో సవరణలు చేసి వెనుకబడిన ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నామని మభ్యపెడుతూ మూడు రాజధానులకే జై అని తమచేత అరిపిస్తూ జగన్ ప్రభుత్వం మభ్యపెడుతుందని విమర్శించారు. పాలనా అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా కర్నూలు (Kurnool)లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని, కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.