TDP: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో అవకతవకలు జరిగాయి

ABN , First Publish Date - 2022-11-11T16:23:53+05:30 IST

Amaravathi : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో అవకతవకలు జరిగాయని ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది.

TDP: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో అవకతవకలు జరిగాయి

Amaravathi : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో అవకతవకలు జరిగాయని ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 7న నెల్లూరు, చిత్తూరులో ఒకే రోజు 54 వేల దరఖాస్తులు రావటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎమ్మార్వోలను భయపెట్టి గంపగుత్తుగా దరఖాస్తులు ఇచ్చారని, చివరి రోజు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని సీఈవోను కోరామని అశోక్ బాబు చెప్పారు. సీఈవో స్పందించకుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. తూర్పు రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే చివరి రోజు 10వేల దరఖాస్తులు ఇచ్చాయని, అదనపు కౌంటర్లు లేకుండా ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెప్పించిన దొంగ సర్టిఫికెట్లతో ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. వలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-11T16:23:54+05:30 IST