Kadapa.. అంతర్ రాష్ట్ర మోసగాడు అరెస్ట్: ఎస్పీ అన్బురాజన్

ABN , First Publish Date - 2022-11-16T15:15:04+05:30 IST

కడప: లోన్ యాప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ముఠాకు సహకరిస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Kadapa.. అంతర్ రాష్ట్ర మోసగాడు అరెస్ట్: ఎస్పీ అన్బురాజన్

కడప: లోన్ యాప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ముఠాకు సహకరిస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంతర్ రాష్ట్ర లోన్ యాప్ కమీషన్ ఏజెంట్ జలాల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బద్వేల్‌లో మోహన్ అనే వ్యక్తి ఫిర్యాదు ద్వారా పోలీసులు గుట్టురట్టు చేశారన్నారు. జలాల్ ఖాన్‌ 14 రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని, 7 బ్యాంక్ అకౌంట్‌‌లను గుర్తించి రూ. 2.05 కోట్ల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు లోన్ యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లోన్ యాప్, సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు.

Updated Date - 2022-11-16T15:15:14+05:30 IST