low pressure: నాలుగైదు తేదీల్లో అల్పపీడనం.. ఆరేడు తేదీల్లో వర్షాలు
ABN , First Publish Date - 2022-11-28T20:47:41+05:30 IST
ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన అండమాన్ సముద్రంలో అల్పపీడనం (low pressure) ఏర్పడనున్నది.
విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన అండమాన్ సముద్రంలో అల్పపీడనం (low pressure) ఏర్పడనున్నది. తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ బలపడుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా (south coast)లో ఆరేడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంపైకి ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. కళింగపట్నం (Kalingapatnam)లో 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.