మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు
ABN , First Publish Date - 2022-10-31T00:26:59+05:30 IST
దురలవాట్లకు బానిసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మోటార్‌సైకిళ్ల దొంగగా అవతారమెత్తారు. ఒంగోలు నగరంలో పలు వాహనాలను చోరీ చేసి పోలీసులకు దొరికి పోయాడు.
నిందితుడు ఇంజనీరింగ్ విద్యార్థి
అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు వెల్లడి
ఒంగోలు(క్రైం), అక్టోబరు 30: దురలవాట్లకు బానిసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మోటార్‌సైకిళ్ల దొంగగా అవతారమెత్తారు. ఒంగోలు నగరంలో పలు వాహనాలను చోరీ చేసి పోలీసులకు దొరికి పోయాడు. ఈ మేరకు ఆదివారం ఒంగోలు వ న్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో జరిగిన మీడియా స మావేశంలో అదనపు ఎస్పీ(క్రైం) శ్రీధర్‌రావు మాట్లాడుతూ టంగుటూరు మండలం ఆలకూ రపాడుకు చెందిన వల్లూరి వెంకటేశ్వర్లు అనే ఇంజనీరింగ్ విద్యార్థి జల్సాగా బతకడానికి అల వాటు పడ్డాడు. ఈక్రమంలో ప్రేమవివాహం చే సుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి మోటార్ సైకిల్ దొంగగా మారాడు. నగరంలో 10 మో టార్‌సైకిళ్ళు, ఒక ఆటో దొంగిలించాడని, నింది తుడిని వన్‌టౌన్ పోలీసులు కొత్తపట్నం మం డలం మడనూరు సమీపంలో ఆదివారం అరె స్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద వాహనా లను మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుం దన్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను అదనపు ఎస్పీ ప్రశంసించారు. సమావేశంలో డీ ఎస్పీ యు.నాగరాజు, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎ స్సై యు.వి.కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.