మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు
ABN , First Publish Date - 2022-11-08T23:28:43+05:30 IST
జులాయిగా తిరుగుతూ పేకా టకు అలవాటు పడి డబ్బు కోసం చోరీలు చేయడం అలవాటు పడ్డాడు ఓ యువకుడు. అనుమానస్పదంగా తిరుగుతున్న అత డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగత నాల విషయం వెలుగులోకి వచ్చింది.
15 వాహనాలు స్వాధీనం
డీఎస్పీ నాగరాజు
ఒంగోలు(క్రైం), నవంబరు 8: జులాయిగా తిరుగుతూ పేకా టకు అలవాటు పడి డబ్బు కోసం చోరీలు చేయడం అలవాటు పడ్డాడు ఓ యువకుడు. అనుమానస్పదంగా తిరుగుతున్న అత డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగత నాల విషయం వెలుగులోకి వచ్చింది. అతడి వద్ద నుంచి 15 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవా రం ఒంగోలు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు.
సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామానికి చెం దిన చల్లా నరసింహారావు అలియాస్ బిలాయ్ అనే యువకు డు చిన్న వయస్సులోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మోటార్‌సైకిళ్లను దొంగిలించి తక్కువ ధరకు విక్రయించి వచ్చి న డబ్బుతో పేకాట ఆడుతుంటాడు. ఈక్రమలో ఒంగోలు నగ రంలో అనేక ప్రాంతాల్లో 20 మోటార్‌సైకిళ్లను చోరీ చేశాడు. అక్రమంలో మంగళవారం స్థానిక పీవీఆర్ బాలుర హైస్కూల్ వద్ద వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహి స్తున్న సిబ్బందికి పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకొని 11 కేసుల్లో 15 మోటార్‌సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మరో ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా దొంగను పట్టుకున్న సీఐ వెంకటే శ్వర్లు, ఎస్సై కృష్ణయ్య, సిబ్బంది చక్రవర్తి, సాయికృష్ణ, విజయ్, అనిల్, ఖాజవలి, తిరుపతయ్య, శ్రీనులను ఎస్పీ మలికగ ర్గ్ అభినందించినట్లు తెలిపారు. వారికి రివార్డులను అందజేశారు.