Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు, లోకేష్ దసరా శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-10-05T13:55:59+05:30 IST
విజయదశమి సందర్భంగా నారా లోకేష్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి (Amaravathi): విజయదశమి (Vijayadasami) సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు (Dussehra Greetings) తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని అన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో సకల జనులకు మంచి జరగాలని, దుర్గమ్మ చల్లని చూపులతో ఏపీ సుభిక్షం, సుసంపన్నం కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ దుర్గా మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని, చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నానని లోకేష్ అన్నారు.