ఫోర్‌లైన ఓ ఫార్సు
ABN , First Publish Date - 2022-11-23T00:31:11+05:30 IST
అనంతపురం నగరంలో వంకర, టింకర రోడ్డుపై విచారణ చేసి నిష్పక్షపాతంగా రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగలక్ష్మికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అవే సంస్థ ఆధ్వర్యంలో గతంలో కలెక్టరేట్ ఎదుట ఫాదర్‌ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.. రోడ్దు విస్తరణ పేరుతో ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని తొలగించి, తిరిగి పునఃప్రతిష్టంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నిర్మాణంలో లోపాలు..
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి
కలెక్టర్‌కు ప్రభాకర్‌చౌదరి వినతి
అనంతపురం అర్బన/అనంతపురం టౌన, నవంబరు 22: అనంతపురం నగరంలో వంకర, టింకర రోడ్డుపై విచారణ చేసి నిష్పక్షపాతంగా రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగలక్ష్మికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అవే సంస్థ ఆధ్వర్యంలో గతంలో కలెక్టరేట్ ఎదుట ఫాదర్‌ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.. రోడ్దు విస్తరణ పేరుతో ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని తొలగించి, తిరిగి పునఃప్రతిష్టంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో సుభా్‌షరోడ్డు, గుత్తి రోడ్డు నిర్మాణాలకు టీడీపీ హయాంలో కేంద్రం పెద్దలను కలిసి నిధులు తెచ్చామ న్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. సుభా్‌షరోడ్డు, క్లాక్‌టవర్ మీదుగా వేసే రోడ్డు వంకర, టింకరగా నిర్మించడం దారుణమన్నారు. ఒక చోట రోడ్డును కుదించడం, మరొకచోట వెడల్పు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రోడ్డు నిర్మాణం మాస్టర్ ప్లానను బహిర్గతం చేయకుండా కమీషన్ల కోసమే కాంట్రాక్టు పనులు చేసేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలుసార్లు రోడ్లు నిర్మాణంలో అవకతవకలపై ప్రశ్నించినా మార్పు రాలేదన్నారు. ఇటీవల వరదల్లో పలు కాలనీలో ముంపునకు గురయ్యాయన్నారు. జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఏడు వెంట్లు వేయగా, నడి మి వంక వద్ద బ్రిడ్జికి కేవలం మూడు వెంట్లు వేయడమేమిటని ప్రశ్నించారు. వీటన్నింటిపై ఈనెల 30వ తేదీ వైసీపీయేతర పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, మేధావులను కలుపుకొని భవిష్యత కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. చట్టపరంగా కూడా పోరాటానికి సిద్ధమవుతామని ఆయన స్పష్టం చేశా రు. ఈ కార్యక్ర మంలో మాజీ డిప్యూ టీ మేయర్ గంపన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళీ, జిల్లా అధికార ప్రతినిఽధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంగినాగ, తెలుగు మహిళా రాష్ట్రప్రధాన కార్యదర్శి స్వప్న, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని, గొర్రెలు,మేకల కార్పొరేషన మాజీ డైరెక్టర్ శివబాల, టీడీపీ నాయకులు గుర్రం నాగభూషణం, పావురాల చంద్రశేఖర్, ముక్తియార్, గోపాల్ గౌడ్, మార్కెట్ మహేష్, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.