AP News: సీఎం జగన్‌కి సోము వీర్రాజు బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2022-11-21T18:00:49+05:30 IST
Amaravathi: ముఖ్యమంత్రి జగన్(CM Jagan)కి ఏపీ బీజేపీ (BJP) చీఫ్ సోము వీర్రాజు (Somu veerraju) బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమల స్థాపనకు ఎన్ని భూములు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు ప్రారంభించారో శ్వేత పత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
Amaravathi: ముఖ్యమంత్రి జగన్(CM Jagan)కి ఏపీ బీజేపీ (BJP) చీఫ్ సోము వీర్రాజు (Somu veerraju) బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమల స్థాపనకు ఎన్ని భూములు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు ప్రారంభించారో శ్వేత పత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూములు కేటాయించిన తరువాత పరిశ్రమలు ఎందుకు ప్రారంభం కాలేదు? దీనిపై పాలక ప్రభుత్వం ఎప్పుడైనా సమీక్షించిందా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్న కారణంగానే.. పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా వెనక్కి వెళుతున్నట్లు పలు సంస్థలు ప్రభుత్వానికి లేఖలు సమర్పిస్తున్నాయని తెలిపారు. ఈ తరహా అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కారిడార్‌లను ఏర్పాటు చేస్తే, రాష్ట్రప్రభుత్వం అందుకు అనుగుణంగా సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించాలని సూచించారు.