విశాఖ చేరుకున్న రాష్ట్రపతి
ABN , First Publish Date - 2022-02-21T08:04:27+05:30 IST
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి
విమానాశ్రయంలో సీఎం, గవర్నర్ ఘన స్వాగతం
విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష (పీఎ్‌ఫఆర్)లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్‌గుప్తా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి, జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, సత్యవతి, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.