నేడు రైల్వే సీఆర్‌ఎస్ పర్యటన
ABN , First Publish Date - 2022-11-26T00:31:58+05:30 IST
గుత్తి రైల్వే జంక్షన పరిధిలో సీఆర్‌ఎస్ అభయ్‌కుమార్ రాయ్ శనివారం పర్యటిస్తారని రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రోడ్డులో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన భవనాన్ని, ప్లాట్ ఫాం పనులను ఆయన పరిశీలిస్తారు.
కొత్త స్టేషన పేరు ‘గుత్తి ఫోర్ట్’
గుత్తి, నవంబరు 25: గుత్తి రైల్వే జంక్షన పరిధిలో సీఆర్‌ఎస్ అభయ్‌కుమార్ రాయ్ శనివారం పర్యటిస్తారని రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రోడ్డులో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన భవనాన్ని, ప్లాట్ ఫాం పనులను ఆయన పరిశీలిస్తారు. గుత్తి - ధర్మవరం, గుత్తి - రేణిగుంట రైలు మార్గాన్ని కూడా పరిశీలిస్తారు. సీఆర్‌ఎస్ రాక నేపథ్యంలో బైపాస్ రైల్వే స్టేషన పనులను వేగవంతం చేశారు. సీఆర్‌ఎస్ పర్యటనలో డీఆర్‌ఎం, ఇతర అధికారులు పాల్గొంటారు.
గుత్తి ఫోర్ట్ స్టేషన
రైళ్ల రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుత్తి రైల్వే స్టేషన సమీపంలో కర్నూలు గేట్ వద్ద నూతనంగా బైపాస్ రైల్వే స్టేషన నిర్మాణ పనులు చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రైల్వే స్టేషన పేరు కోసం రెవెన్యూ అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. గుత్తి టౌన, గుత్తి ఫోర్ట్ పేర్లను ప్రతిపాదించగా, అధిక శాతం గుత్తి ఫోర్ట్‌ను కోరుకున్నారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు నూతన రైల్వే స్టేషనకు ‘గుత్తి ఫోర్ట్ స్టేషన’ పేరును ఖరారు చేశారు. ఈ పేరుతో గుత్తి కోట ప్రాశస్త్యం మరింత వెలుగులోకి వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.