Rajahmundry: చినరాజప్పతో పాటు పలువురు నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2022-11-03T16:52:37+05:30 IST
Rajahmundry: చినరాజప్పతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అయ్యన్న అక్రమ అరెస్ట్‌పై నిరసన తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేత చినరాజప్ప (Chinarajappa)తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, టీడీపీ (TDP) నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
టీడీపీ మహిళా నేతలను పోలీసులు పక్కకు నెట్టివేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగిడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.