సీఎంకు సర్పంచ్‌ల ‘ఉత్తరాల ఉద్యమం’

ABN , First Publish Date - 2022-11-03T23:54:32+05:30 IST

గ్రామపంచాయతీల్లో ఆర్థిక సంఘం నిఽ దులను వినియోగ విషయంలో పంచాయతీల అధికారాలను హరిస్తున్న రాష్ట్ర ప్ర భుత్వ వైఖరని నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సర్పంచ్‌లు ఉత్తరాల ఉద్యమం చేపట్టనున్నట్లు సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభ ద్రాచారి తెలిపారు.

సీఎంకు సర్పంచ్‌ల ‘ఉత్తరాల ఉద్యమం’

7న పంచాయతీల ప్రత్యేక సమావేశాలు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 3: గ్రామపంచాయతీల్లో ఆర్థిక సంఘం నిఽ దులను వినియోగ విషయంలో పంచాయతీల అధికారాలను హరిస్తున్న రాష్ట్ర ప్ర భుత్వ వైఖరని నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సర్పంచ్‌లు ఉత్తరాల ఉద్యమం చేపట్టనున్నట్లు సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభ ద్రాచారి తెలిపారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో గురువారం జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 7వతేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను వి ద్యుత్‌ బిల్లులు, క్లాప్‌ మిత్రులకు వేతనాలు చెల్లింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సర్పంచ్‌లతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చే స్తే ప్రభుత్వానికి తగినమూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి పగడాల రమేష్‌, సిరి గిరి రమేష్‌, రాముయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T23:54:34+05:30 IST